Dheera Movie Pre Release Event: వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోన్న క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈ ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తూనే ఉన్నాం. అనురాధ ప్రొడక్షన్స్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారని పేర్కొన్న ఆయన ఆ టైంలోనే నేను డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించానన్నారు. వారితో నాకు పెద్దగా పరిచయం ఉండేది కాదు కానీ దసరా సినిమా కొన్నారని తెలిసి కలిశానని ఆ తరువాత మేం వ్యక్తిగతంగా ఎంతో దగ్గరయ్యామని అన్నారు.
HanuMan 3D: హనుమాన్ త్రీడీ వెర్షన్ టెస్టింగ్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఫిలిం చాంబర్ ఎలెక్షన్స్‌లోనూ నేను అధ్యక్షుడిగా ఉండాలని నా కోసం ఎంతో సహాయం చేశారని, నాకు మిగిలిన ఈ టైంలో, ఆ పదవి నుంచి వెళ్లే లోపు రిజల్ట్‌ను చూపించే ప్రయత్నం చేస్తానన్నారు. లక్ష్ నటించిన ధీర ట్రైలర్ బాగుందన్న ఆయన సినిమా ఫిబ్రవరి 2న రాబోతోంది, లక్ష్ కష్టానికి, టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలన్నారు. ఇక హీరో లక్ష్ మాట్లాడుతూ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకి ఇండస్ట్రీలో చాలా కష్టం. మా మీద అంచనాలుంటాయి, బయటకు వెళ్తే అవకాశాలు రావు. మీ నాన్న గారు ఉన్నారు కదా? అని అంటారు. నేను కూడా ఆఫీస్‌ల చుట్టూ తిరిగా, మాక్కూడా అవకాశాలు రావడం కష్టమే అన్నారు. ఫిబ్రవరి 2న మా సినిమా రాబోతోందని అన్నారు. యష్ హ్యాపీ ఎండింగ్, ధీరజ్ అంబాజీపేట, సోహెల్ బూట్ కట్ బాలరాజు ఇలా అన్ని సినిమాలు హిట్ అవ్వాలని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుందని ఇండస్ట్రీ బాగుంటేనే మేం అంతా బాగుంటామ’ని అన్నారు.
