Site icon NTV Telugu

‘దియా’ తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది

కన్నడ హిట్ సినిమా ‘దియా’ తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 19న డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కన్నడలో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కె.ఎస్‌.ఎస్‌ అశోక దర్శకత్వం వహించిన ఈ ట్రైయాంగిల్ ప్రేమ కథలో ఖుషీ రవి, పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించారు. ఈ సినిమాను ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరిగాయి. కాగా, తాజాగా ఆగస్టు 19న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఈమేరకు రేపు ప్రసాద్ లాబ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

Exit mobile version