NTV Telugu Site icon

‘దోస్తానా-2’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన ధర్మ ప్రొడక్షన్స్

Dharma Productions confirm Kartik Aaryan will be replaced in 'Dostana 2'

జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘దోస్తానా-2’పై గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కార్తీక్ ఆర్యన్ ను తొలగించారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. “వృత్తిపరమైన పరిస్థితుల కారణంగా మేము గౌరవప్రదమైన నిశ్శబ్దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. మేము కొల్లిన్ డి’కున్హా దర్శకత్వం వహించిన దోస్తానా 2 కు రికాస్టింగ్ చేయబోతున్నాము. దయచేసి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి” అని ట్వీట్ చేశారు మేకర్స్. కార్తీక్ ఆర్యన్ ను ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించినట్లు మొత్తానికి చాలా ఊహాగానాల తరువాత ధర్మ ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. ఇక కార్తీక్ ఆర్యన్ పాత్ర కోసం రాజ్ కుమార్ రావును చిత్రబృందం ఇప్పటికే సంప్రదించారని వార్తలు విన్పిస్తున్నాయి. మరోవైపు విక్కీ కౌశల్ కూడా ఈ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకోవడం గమనార్హం.