Site icon NTV Telugu

Danush : ఇడ్లీ కొట్టు మీద తెలుగు డిస్ట్రిబ్యూటర్ల గట్టి పోటీ!

Dhanush Idly Kadai Movie

Dhanush Idly Kadai Movie

తమిళ స్టార్ హీరో ధనుష్ కేవలం నటనలోనే కాకుండా దర్శకత్వ రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన ‘రాయన్’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయాన్ని అందుకున్న ధనుష్, ప్రస్తుతం తన ద్వితీయ దర్శకత్వ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం పేరు ‘ఇడ్లీ కొట్టు’ (తమిళంలో ఇడ్లీ కడై). గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తున్నారు.

Also Read : Janaki V vs State of Kerala : టైటిల్ మార్చిన జానకి సినిమా ట్రైలర్ వచ్చేసింది!

డాన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయాలని నిర్ణయించిన ప్పటికీ, అనివార్య కారణాల వల్ల రిలీజ్‌ను అక్టోబర్ 1కి వాయిదా వేశారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, సముద్రఖని, శాలినీ పాండే వంటి ప్రముఖులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ధనుష్ సినిమా కావడంతో, దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ధనుష్ నటించిన ‘సార్’ సినిమా తెలుగులో మంచి హిట్‌గా నిలవగా, తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం ‘కుబేర’ కూడా బిగ్ హిట్‌ను నమోదు చేసుకుంది. అయితే ఈ వరుస విజయాల ప్రభావంతో ‘ఇడ్లీ కొట్టు’ తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం తెలుగు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పోటీపడుతున్నాయి.

ఇందులో ప్రధానంగా రెండు సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకటి ‘సార్’ సినిమాను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మరొకటి కుబేర నిర్మాత సునీల్ నారంగ్. ఇద్దరూ తమ తమ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలో ఈ హక్కులు ఎవరికి దక్కనున్నాయనే ఆసక్తికర చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతోంది.

Exit mobile version