Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yatra: భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ పెద్ద కొడుకు యాత్ర సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో స్వయంగా ధనుష్ తన కొడుకుని హీరోగా పరిచయం చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం కూడా జరుగుతుంది. ఈ తరుణంలో ధనుష్ తన కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై స్పష్టతనిచ్చారు.
తాజాగా నిర్వహించిన కర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ధనుష్‌ను తన కొడుకు సినిమా ఎంట్రీ గురించి ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను కేవలం 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇప్పుడు యాత్ర వయసు 19 ఏళ్లు. అయినప్పటికీ తను నాకు ఇంకా చిన్న పిల్లోడిలాగే కనిపిస్తున్నాడు. భవిష్యత్తులో తను ఏమవుతాడో నాకింకా తెలియదు. సినిమాల్లోకి వస్తాడా? లేక మరో రంగంలోకి వెళ్తాడా? అనేది ఇప్పుడే చెప్పలేను” అని ధనుష్ పేర్కొన్నారు. నిజానికి యాత్రకు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తన స్టైలిష్ లుక్స్‌తో తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకుంటున్నాడు. అయితే ధనుష్ మాటలను బట్టి చూస్తుంటే, యాత్రను హీరోగా చూడటానికి అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదనిపిస్తోంది. మరోవైపు ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఈ నెల 30న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.
Also Read
- Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
- Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
- Navya Nanda: అమ్మ డ్రెస్‌తోనే ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ మనవరాలు.. గోల్డెన్ లుక్‌తో సోషల్ మీడియా షేక్!
- The Paradise : 'ది ప్యారడైజ్'కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
తాజావార్తలు
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!