ఇటీవల వెంకటేశ్వర స్వామి పాటను రీమిక్స్ చేసి సినిమాలో వాడారని ఒక్కసారిగా హైలైట్ అయిన డిడి నెక్స్ట్ లెవెల్(డెవిల్స్ డబుల్) నెక్స్ట్ లెవెల్ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ZEE5 ద్వారా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో భాషలలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాలోని కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఇప్పటికే థియేటర్లో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
Also Read : OTT Movie: ఓటీటీకి మర్డర్ మిస్టరీ సినిమా.. ఎందులో చూడాలంటే?
సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతిక తివారీ నటించిన ఈ సినిమా కథ అంతా కూడా సినీ విమర్శకుడు కిస్సా (సంతానం) చుట్టూ తిరుగుతుంది. అసాధారణ దర్శకుడు హిచ్‌కాక్ ఇరుధయరాజ్ (సెల్వరాఘవన్) ప్రైవేట్ స్క్రీనింగ్‌లోకి రావడం, అక్కడే సినిమాలో ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడం వంటి కామెడీ, హారర్ అంశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. కిస్సా తనకు దొరికిన ఆధారాలు డీకోడ్ చేస్తూ బయటకు ఎలా వచ్చారన్నది ఆసక్తికరంగా సాగుతుంది.
