NTV Telugu Site icon

Devara: తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి.. దేవర -2 దాదాపు లేనట్టే..?

Untitled Design 2024 08 11t072059.029

Untitled Design 2024 08 11t072059.029

ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది “దేవర”. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది దేవర. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దేవర రెండు భాగాలుగా రాబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

దేవర మొదటి భాగం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ఇదే వరకే ప్రకటించారు.కానీ ఇప్పడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దేవర -2పై అనుమానాలు నెలకొన్నాయి. తారక్ ప్రస్తుతం దేవర తో పాటు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ -2లో నటిస్తున్నాడు. ఈ ఏడాది చివరకి ఆ సినిమా కంప్లిట్ అవుతుంది. మరోవైపు తారక్ – ప్రశాంత్ నీల్ ల పాన్ ఇండియా సినిమాను గడిచిన గురువారం ప్రారంభించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ రెండు పార్ట్స్ ను పూర్తి చేసేదాకా మారే సినిమా చేయకుండా డేట్స్ కేటాయించారు తారక్. ఈ రెండు భాగాలు షూట్ కంప్లిట్ అవడానికి 2026 వరకు సమయం అవుతుంది. దేవర -2 చేయాలంటే 2026 వరకు వెయిట్ చేయాలి. అంటే దాదాపు రెండవ పార్ట్ దాదాపు లేనట్టే. కాగా అటు దేవర, ప్రశాంత్ నీల్ సినిమాను ఇతరుల భాగస్వామ్యంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. మరి దేవర -2ను తీసుకు వస్తారో లేదో అనేది దేవర పార్ట్ -1 రిజల్ట్ పై ఆధారపడి ఉంది.

Show comments