Site icon NTV Telugu

Devara Part – 1 : భైరా గాడి దెబ్బకు జనాలు అబ్బా.. సైఫ్ అదరకొట్టాడు బాసూ!

Devara Part 1

Devara Part 1

Devara Part – 1 Saif Ali Khan Glimpse Released: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి సినిమా యూనిట్ ఒక అప్డేట్ ఇచ్చింది. ఈరోజు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ద్వారా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న పాత్ర పేరు భైరా అని క్లారిటీ వచ్చేసింది. ఇక మల్లయోధుడిలా కనిపిస్తున్న బైరా మల్ల యుద్ధం చేస్తూ ప్రత్యర్థిని ఎత్తి విసిరేస్తునట్టుగా వీడియోలో చూపించారు. అతను ఒక లెజెండ్రీ వ్యక్తి అని క్లారిటీ ఇస్తూనే అతని పాత్ర ఎలా ఉంటుంది అనేది చూపిస్తూ 53 సెకండ్ల వీడియోని షేర్ చేశారు.

Jani Master: బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు.. ఏ సినిమాకో తెలుసా?

ఇక కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతోంది. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాని యువసుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మీద ఇటు ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత ఖచ్చితంగా హిట్ పడాలని ఎన్టీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారు. కొరటాల శివ కూడా ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత మరో హిట్టు కొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కొట్టడంతో ఈ సినిమా కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version