యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా చేసిన ప్రతి ఒక్కరు ఎన్టీయార్ అద్భుతంగా ఉందని సినిమాను ఆసాంతం భుజ స్కందాలపై నడిపాడని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరింతగా నిలబెట్టిందనే చెప్పాలి. సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే టాక్ కాస్త గట్టిగా వినిపించింది. మరి ముఖ్యంగా దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయాయని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో వచ్చే షార్క్ ఫైట్, అండర్ వాటర్ సిక్వెన్సు వేరే లెవల్ లో ఉన్నాయని ప్రేక్షకులు చెప్తున్నారు.
Also Read : Devara : బంగారం లాంటి మా జాన్వీ పాపను కొంచమే చూపెట్టారు..
కాగా సినిమా మొత్తం మీద ఆడియన్స్ ఓక విషయంలో మాత్రం అసంతృప్తి గా ఉన్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన షార్క్ ఫైట్, మొదటి భాగంలోని షిప్ యార్డ్ ఫైట్ లోని VFX పై ఇంకాస్త వర్క్ చేయాల్సిందని, అలాగే సినిమాను కొంత భాగం ట్రిమ్ చేస్తే ఇంకొంచం బాగుండేది అని ఎక్కువ మంది నుండి వినిపిస్తున్న మాట. సీజీ వర్క్ కోసం దేవర నిర్మాతలు చాలా ఎక్కువగానే ఖర్చు చేసారు. వాటి కోసమే సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోనే చేసుకుంటూ వచ్చారు. ఇంత సమయం కేటాయించినా కూడా అవుట్ పుట్ బాలేదనేది మెజారిటి ఆడియెన్స్ మాట. ఆ విషయంలో నిర్మాతలు ద్రుష్టి పెట్టుంటే మెరుగైన ఫలితం ఉండేదనిభావిస్తున్నారు. మొత్తానికి 6 ఏళ్ల నిరీక్షణ తర్వాత రిలీజ్ అయిన దేవర ఫ్యాన్స్ కు పండగలా ఉంది. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు ఏమి లేకపోడవం ఓన్లీ దేవర మాత్రమే ఉండడంతో కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.