దేవర రిలీజ్ మొదటి రోజు నుండి నేటి వరకు కలెక్షన్ల సునామి కొనసాగిస్తుంది. వర్కింగ్ డేస్ లో కొన్ని ఏరియాస్ లో కాస్త తగ్గినా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీకెండ్స్, హాలిడేస్ లో మాత్రం హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టాడు దేవర. పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండడంతో దేవరకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర కలెక్షన్స్ లో సూపర్ పర్ఫామెన్స్ చేస్తోంది.
Also Read : Akkineni : కొండా సురేఖను హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటుడు
ఇక తెలుగు రాష్ట్రాల్లో దేవర శనివారం సెకండ్ షోస్ ముగిసే నాటికి దాదాపుగా అన్ని ఏరియాలాలో బ్రేక్ ఈవెన్ కు దాటేసింది దేవర. ఇక నుండి వచ్చేవన్నీ లాభాలే. దసరా సెలవులు కూడా కలిసి రావడం మరే పెద్ద సినిమాలు లేకపోవడం దేవరకు బిగ్ అడ్వాంటేజ్.అటు ఓవర్సీస్ లోను దేవర స్టడీగా ఉన్నాయి. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో రూ. 5.75 మిలియన్ రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.తొమ్మిదో రోజు $110,168 వసూల్ చేసి సూపర్ స్ట్రాంగ్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే లాభాల బాటలో పయనిస్తోంది దేవర. మొదటి రోజు స్లో గా స్టార్ట్ అయిన దేవర హిట్ టాక్ తో సూపర్ వసూళ్లు రాబట్టి తారక్ కు హిందిలో మంచి మార్కెట్ సెట్ చేసింది. కేరళలోను బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు తెచ్చిపెట్టింది దేవర. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 2 కోట్లు పైగా రాబట్టింది. కన్నడలో డే – 1 నుండే దేవర డామినేషన్ స్టార్ట్ అయింది. కల్కి తర్వాత లాభాలు చుసిన స్టార్ హీరో సినిమా దేవర మాత్రమే