Site icon NTV Telugu

Devara : ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ లో అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న దేవర కటౌట్

Untitled Design (6)

Untitled Design (6)

ఎట్టకేలకు అనేక రిలీజ్ వాయిదాల తర్వాత దేవర వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. దింతో ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈలలు, గోళాలు, టపాయకాయలు, dj సౌండ్స్ తో థియేతారలు మోత మోగిపోయాయి. కాగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేరొందిన థియేటర్ సుదర్శన్ 35MM లో దేవర కు కేటాయించారు. నిన్న రాత్రి నుండి భారీ కటౌట్ లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, బాణాసంచాలతో అభిమానులు ఎన్టీయార్ పాటలతో హోరెత్తించారు. కాగా తెల్లవారు జామున నుండి షోస్ స్టార్ట్ చేసారు. ఈ నేపథ్యంలో ఉదయం ఆట ముగిసాక  సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు.

Also Read : Devara : తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..

ఈ క్రమం లో నిప్పు రవ్వ పక్కనే ఉన్న ఎన్టీయార్ కటౌట్ పై పడింది. చెక్క కటౌట్ కావడంతో నిప్పు రవ్వ పడడంతో ఒక్కసారిగా    మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఎన్టీయార్ కటౌట్ పూర్తిగా తగలబడింది. దీంతో బయాందోళకు గురైన ప్రేక్షలులు పరుగులు తీసారు. ఫ్యాన్స్  మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version