NTV Telugu Site icon

Devara 2nd Single: అనిరుధ్ భయ్యా.. పాట మామూలుగా లేదు కానీ?

Devara Second Single Released

Devara Second Single Released

Devara 2nd Single Chuttamalle Song Response: సెప్టెంబర్ 27న దేవర మొదటి పార్ట్ రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై.. ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అయితే.. అప్పుడెప్పుడో దేవర నుంచి ఒక గ్లింప్స్, ఒక పాట రిలీజ్ చేశారు. దీంతో.. దేవర నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. అంతేకాదు.. రిలీజ్‌కు మరో యాభై రోజుల సమయం కూడా లేదు. ఇంకెప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు? పాన్ ఇండియా రీచ్ రావాలంటే ప్రమోషన్స్ గట్టిగా ఉండాల్సిందే.. అనే కామెంట్స్ వినిపించాయి. దానికి తోడు.. ఫస్ట్ సింగిల్ విషయంలో అనిరుధ్ ఆశించిన స్థాయిలో ట్యూన్ ఇవ్వలేదనే టాక్ వినిపించింది.

Sekhar Basha: శేఖర్ బాషాను రౌడీలతో కొట్టించిన లావణ్య?

అందుకే.. తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయిపోయింది. చెప్పినట్టుగానే.. ఈపాట మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఈ మెలోడీ సాగింది. ముఖ్యంగా జాన్వీ గ్లామర్ ఈ సాంగ్‌లో హైలెట్ అనే చెప్పాలి. అలాగే.. ఇప్పటివరకు రక్తపాతాన్ని, ఎరుపెక్కిన సముద్రాన్ని చూసిన అభిమానులు.. ఈ పాటతో ఫ్రెష్ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లలో లాగానే పూల చొక్కాతో పాటు బ్లాక్ కలర్ ప్యాంట్లో ఇరగదీసేలా కనిపిస్తున్నాడు. ఇక సాంగ్లో విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో కుదిరాయి అని చెప్పాలి. అంతేకాక కొరియోగ్రఫీ కూడా వేరే లెవల్లో ఉంది.

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీతో పాటు డాన్స్ కోఆర్డినేషన్ కూడా వేరే లెవెల్ లో ఉంది. శిల్పారావు వాయిస్ కూడా జాన్వికి కరెక్ట్ గా సెట్ అయింది అని చెప్పవచ్చు. అయితే బీట్ మాత్రం కాస్త మెలోడీగా అనిపిస్తూనే అనిరుద్ పాత పాట ఒకదాన్ని గుర్తుతెచ్చేలా ఉంది. అలాగే ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యే కంటే స్లోగా ఎక్కేలా కనిపిస్తోంది. ఇందులో లొకేషన్స్, విజువల్స్ అదిరిపోయాయి. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కూడా బాగున్నాయి. మొత్తంగా.. అందరూ హమ్ చేసేలా ఉన్న ఈ పాటతో అనిరుధ్ అదరగొట్టాడాని.. ఫుల్ ఖుషీ అవుతున్నారు టైగర్ ఫ్యాన్స్. అలాగే.. డిజిటల్ రికార్డుల పరంగా ఈ పాట ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇక్కడి నుంచి దేవర ప్రమోషన్స్ స్పీడ్ అయినట్టే. మరి రోజు రోజుకి అంచనాలను పెంచేస్తున్న దేవర.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show comments