Devara 2 : ఇంకెక్కడి దేవర 2.. కొరటాల కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర సినిమా రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు దేవర 2 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో ఎన్టీఆర్, దేవర 2 ఉంటుందని కన్ఫామ్ చేసినప్పటికీ.. ఇప్పట్లో మాత్రం ఉండేలా కనిపించడం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. 2027 జూన్ 11న రిలీజ్ కానున్నట్టుగా తాజాగా ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే.. దేవర ఇప్పట్లో కష్టమే. నిజానికి ఇదే ఏడాదిలో దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌తో దాదాపు ఏడాది లాక్ అయిపోయాడు ఎన్టీఆర్.
Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫాన్స్ కు షాక్..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
కానీ కొరటాల శివ మాత్రం దేవర2 దగ్గరే ఆగిపోయాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మరింత లేట్ అయ్యేలా ఉంది కాబట్టి.. ఈలోపు మరో సినిమా చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణతో కొరటాల సినిమా లాక్ చేసుకున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కొరటాల చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. మరి దేవర 2 ఎప్పుడు ఉంటుంది? అంటే, క్లారిటీ లేకుండా పోయింది. అయితే, మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. ఆరోజు దేవర సీక్వెల్ పై ప్రకటన ఉండే ఉండొచ్చు. లేదంటే మాటల మాంత్రికుడితో తారక్ చేయబోతున్న గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే దాదాపుగా దేవర 2 లేనట్టే. అయితే, ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మేకర్స్ సైడ్ నుంచి అప్డేట్ రావాల్సిందే.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!