IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి

Irumudi

Irumudi

మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 21న  థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే డిజిటల్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్  హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. దాదాపు 14 కోట్ల రూపాయల అటు ఇటుగా భారీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. రవితేజ మార్కెట్ వాల్యూ అలాగే శివ నిర్వాణ గత చిత్రాల ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్ ఈ స్థాయి మొత్తాన్ని చెల్లించడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వాస్తవంగా రవితేజకు గత కొంతకాలంగా సరైన హిట్స్ లేవు. ధమాకా సినిమా తర్వాత థియేటర్ వైజ్ గా కమర్షియల్ సక్సెస్ చూడలేదు. చేసిన ప్రతి సినిమా దేనికదే డిజాస్టర్ గా నిలిచాయి. అయినా కూడా ఇరుముడి భారీ ధర పలికిందంటే కంటెంట్ పై నమ్మకంతోనే నెట్ ఫ్లిక్స్ ఈ ధర పలికిందని టాక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది.

×
×
Ad