IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి‘. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 21న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే డిజిటల్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. దాదాపు 14 కోట్ల రూపాయల అటు ఇటుగా భారీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. రవితేజ మార్కెట్ వాల్యూ అలాగే శివ నిర్వాణ గత చిత్రాల ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్ ఈ స్థాయి మొత్తాన్ని చెల్లించడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వాస్తవంగా రవితేజకు గత కొంతకాలంగా సరైన హిట్స్ లేవు. ధమాకా సినిమా తర్వాత థియేటర్ వైజ్ గా కమర్షియల్ సక్సెస్ చూడలేదు. చేసిన ప్రతి సినిమా దేనికదే డిజాస్టర్ గా నిలిచాయి. అయినా కూడా ఇరుముడి భారీ ధర పలికిందంటే కంటెంట్ పై నమ్మకంతోనే నెట్ ఫ్లిక్స్ ఈ ధర పలికిందని టాక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది.
Also Read
- Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
- Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
- Saif-Kiara Movie: తొలిసారి జోడీ కడుతున్న సైఫ్, కియారా.. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధం
- Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్‌డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
తాజావార్తలు
-
Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
-
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
-
Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
-
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
-
AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!