Site icon NTV Telugu

Demonte Colony 2: వణికి పోవడానికి రెడీ అవ్వండి.. “డిమాంటీ కాలనీ 2” వచ్చేస్తోంది!

Demonte Colony 2

Demonte Colony 2

“Demonte Colony 2” Telugu theatrical release on August 23rd: తమిళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డిమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవాని శంకర్ జంటగా నటించగా అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి రాజ్ వర్మ ఎంటర్ టైన్ మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ల మీద విజయ సుబ్రహ్మణ్యం, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడుగా వ్యవహరించిన “డిమాంటీ కాలనీ 2” సినిమా ఈ నెల 15న తమిళంలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది.

Jani Master: బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు.. ఏ సినిమాకో తెలుసా?

“తంగలాన్” వంటి పెద్ద సినిమాతో రిలీజై బాక్సాఫీస్ వద్ద పోటీని తట్టుకుని ప్రేక్షకాదరణ పొందుతోంది. “డిమాంటీ కాలనీ 2” తెలుగులో ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హారర్ థ్రిల్లర్స్ ను బాగా ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఘన విజయాన్ని అందిస్తారని మూవీ టీమ్ ఆశిస్తోంది. ఇప్పటికే తెలుగులో రిలీజైన “డిమాంటీ కాలనీ 2” ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లోనూ ఇదే రిజల్ట్ ను మేకర్స్ ఆశిస్తున్నారు. ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు. హరీశ్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి కుమరేష్.డి ఎడిటర్.

Exit mobile version