దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ‘పెళ్ళిసందడి’ సినిమా చూసిన వాళ్ళు అందులోని స్వప్నసుందరి దీప్తి భట్నాగర్ ను అంత తేలికగా మర్చిపోరు. ఆ తర్వాత దీప్తి భట్నాగర్ పలు తెలుగు సినిమాలలో నటించినా, స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందలేకపోయింది. దాంతో బుల్లితెరలో కార్యక్రమాలు చేస్తూ బిజీ అయిపోయింది. అయితే ఈ 53 సంవత్సరాల మాజీ కథానాయిక ఇప్పటికీ సోషల్ మీడియాలో బిజీగానే ఉంటోంది. మరీ ముఖ్యంగా అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ చేస్తూ ఈ తరం కథానాయికలకు తానేమీ తీసిపోను అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. తాజాగా పూల్ సైడ్ ప్లాట్ ఫామ్ పై తన బికినీ బాడీని మోనోకినితో కవర్ చేస్తూ టాప్ యాంగిల్ ఫోటోను ఒకదాన్ని దీప్తి భట్నాగర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతవరకూ బాగానే ఉంది కానీ… దానికి ‘నో నెగెటివ్ థాట్స్ అలౌడ్’ అంటూ కాప్షన్ పెట్టింది. దాంతో ‘ఇలాంటి ఫోజులిస్తూ, నెగెటివ్ థాట్స్ రాకూడదంటే ఎలా?’ అని నెటిజన్లు దీప్తిని ప్రశ్నిస్తున్నారు. అవకాశం లభించాలే కానీ మళ్ళీ సినిమాల్లో నటించి సత్తా చాటాలని దీప్తి మనసులో ఉన్నట్టుగా ఉంది. అందుకే ఈ తరహా ఫోజులిస్తోందని కొందరు గుసగుసలాడుతున్నారు.
ఇలా ఫోజిచ్చి…. నెగెటివ్ థాట్స్ వద్దంటే ఎలా!?
