NTV Telugu Site icon

దీపికా సింగ్ ఫోటో షూట్.. నెటిజన్స్ ఫైర్ !

తౌక్టే తుఫాను ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను దాటికి ముంబై అతలాకుతలం అవుతుంది. రోడ్లపై భారీ చెట్లు విరిగిపడుతున్నాయి. అయితే టీవీ న‌టి దీపికా సింగ్ గోయ‌ల్ ఇంటి ముందు కూడా ఓ చెట్టు తుఫాన్ ఈదురుగాలుల‌కు ప‌డిపోయింది. నేల‌రాలిన ఆ చెట్టు వ‌ద్ద‌ దీపికా సింగ్ ఫోటోషూట్ చేసింది. తుఫాన్‌ను ఆప‌లేమ‌ని, ఆ ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్దు అని, మ‌నం ప్ర‌శాంతంగా మారి, ఆ ప్ర‌కృతిని ఎంజాయ్ చేయాల‌ని త‌న పోస్టుకు క్యాప్ష‌న్ ఇచ్చింది. త‌న ఇంటి ముందు రాలిన చెట్టుతో ఎవ‌రికీ ఇబ్బంది కాలేద‌ని దీపిక సింగ్ చెప్పింది. అయితే దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. వర్షాలతో జనజీవితం స్తంభించి పోతుంటే ఫోటో షాట్స్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీరు ఏమి బాగాలేదంటూ విమర్శిస్తున్నారు.