బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కరోనా బారిన పడిన సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. తాజాగా దీపికాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం దీపికా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ నుండి కోలుకోవడానికి ఆమె డాక్టర్లు సూచించిన మందులు తీసుకుంటోంది. దీపికా ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే దీపికా తల్లిదండ్రులు, చెల్లెలికి కరోనా సోకింది. దీపికా తండ్రి ప్రస్తుతం బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఏప్రిల్‌లో మహారాష్ట్రలో 15 రోజుల లాక్డౌన్ ప్రకటించిన తరువాత దీపికా తన భర్త రణ్‌వీర్‌తో కలిసి బెంగళూరులోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే దీపికా ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. అయితే దీపికా భర్త రణవీర్ కు కరోనా సోకిందా లేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. ఇక దీపికా వర్క్ విషయానికొస్తే… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ప్రభాస్ కు జోడిగా నటించనుంది దీపికా. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’లో కూడా నటిస్తోంది.
దీపికా పదుకొనెకు కరోనా పాజిటివ్
