Site icon NTV Telugu

Deepika Padukone : దీపికా కు మరో అరుదైన గౌరవం..

Deepoka

Deepoka

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. టీవలే ఆమె ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ 2026’కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడామె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా దీపికా.. ప్రముఖ మ్యాగజైన్‌ ‘ది షిఫ్ట్‌’ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలిచింది. వినోద రంగానికి గణనీయమైన సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఈ గౌరవాన్ని అందజేస్తారు. ఇందులో భాగంగా ఈసారి మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఎంపిక కావడం విశేషం.

Also Read : Rashmika in ‘Maisa’: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘మైసా’..

ఈ ప్రెస్టీజియస్ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్‌ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి ప్రముఖ హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ప్రముఖులు ఉన్నారు. అయితే, భారతదేశం నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారతీయ సినీ ప్రపంచానికి ఒక గొప్ప గుర్తింపు.ఇక ఇదే గౌరవం బాలీవుడ్ సూపర్‌స్టార్లు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి నటులకు ఇప్పటి వరకు దక్కకపోవడం గమనార్హం. దీపిక తన అంతర్జాతీయ గుర్తింపు, ప్రత్యేకతతో ఈ ఘనతను అందుకోవడంలో తన స్థాయిని మళ్లీ నిరూపించుకుంది.

Exit mobile version