Site icon NTV Telugu

Deepika Padukone: ‘ట్రిపుల్ ఎక్స్‌’ సీక్వెల్‌తో.. మరోసారి హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న దీపికా పదుకొణె

Deepika Padukune

Deepika Padukune

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ ద్యారా తొలిసారి హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్పై యాక్షన్ చిత్రాన్ని డీజే కరుసో దర్శకత్వం వహించారు. ఇందులో విన్ డీసెల్, నినా డోబ్రేవ్, రూబీ రోజ్ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించారు.

Also Read : Tumbad-2 : ‘తుంబాడ్-2’కు రంగం సిద్ధం.. మరోసారి హారర్ ఫాంటసీ మాజిక్!

2017లో విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో, దీపికా అంతర్జాతీయ ఫ్యాన్స్‌ నెట్‌వర్క్‌లో మరింత గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రావడం ఖరారైనట్టు సమాచారం. దీపికా మళ్లీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనున్నారు. తల్లి కావడం కారణంగా, సీక్వెల్‌ చిత్రీకరణను ముంబయిలో ప్రారంభించాలని ఆమె ప్రత్యేకంగా కోరినట్లు సమాచారం. చిత్రబృందం దీన్ని పరిగణనలోకి తీసుకుని సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ సీక్వెల్‌లో దీపికా కొత్త యాక్షన్ సన్నివేశాలు, స్టంట్, డ్రామా సీన్లతో ప్రేక్షకులను మళ్లీ అలరించనుంది. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి, ఎందుకంటే హాలీవుడ్‌లో ఆమె మరోసారి తన ప్రతిభను చాటే అవకాశం ఇది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతుందని, విడుదల తేదీ, షూటింగ్ షెడ్యూల్ వంటి వివరాలు తెలియజేయనున్నారు. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే దీపికా హాలీవుడ్ సీక్వెల్ గురించి చర్చలు చెలరేగాయి. మొత్తానికి, దీపికా పదకొణె తనకిష్టమైన పాత్రలో మళ్లీ అభిమానులను ఆనంద పరచేందుకు సిద్ధంగా ఉంది

Exit mobile version