Site icon NTV Telugu

Darshi : సారంగపాణి జాతకం టీజర్ ఔట్.. హిట్టు కళ కనిపిస్తోంది!

Sarangapani

Sarangapani

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి హిట్స్ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. ఈ రోజు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.

ఇక ‘సారంగపాణి జాతకం’ టీజర్ చుస్తే  హీరో జాతకాలను బాగా నమ్ముతాడు. ‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని చెబుతాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు,  రోజు చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం అవుతుంది? అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేసే యువకుడు. మరి, ఆ జాతకాలపై అమితమైన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని చంపడానికి సారంగపాణి ఎందుకు ట్రై చేసాడు.? నరేష్ ను ఎందుకు కత్తితో పొడిచాడు? అది నిజమా లేదా  కలా? అతని జీవితంలో కీచకుడు ఎవరు? కీచకుడిగా తనికెళ్ళ భరణి ఎటువంటి క్యారెక్టర్ చేశారు? సుందరమ్మ మరణిస్తే హీరో ఎందుకు హ్యాపీగా ఫీలయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు డిసెంబర్ 20న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ పెంచారు. శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, హర్ష చెముడు వినోదం అందర్నీ నవ్విస్తుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్’ అంటూ హీరో పదేపదే చెప్పే మాటలు ఆకట్టుకున్నాయి.

Also Read : RAPO22 : గ్రాండ్ గా రామ్ పోతినేని – మహేశ్ సినిమా లాంఛ్

Exit mobile version