Site icon NTV Telugu

Danush : కొడుకు కోసం ఒకటైన ధనుష్- ఐశ్వర్య.. పిక్స్ వైరల్

Danush Aishwarya

Danush Aishwarya

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తలైవా కూతురు ఐశ్వర్య 2004లో ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ 18 ఏళ్ల తరువాత వివాహ బంధానికి స్వస్తి పలికారు. అసలు ఇలా ఈ జంట విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ డివోర్స్ మీద రకరకాల రూమర్లు కూడా వినిపించాయి. ధనుష్ వేరే నటితో సన్నిహితంగా ఉంటున్నాడని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, అందుకే వ్యవహారం ఇక్కడి వరకు వచ్చిందని. ఇలా చాలా రకాల మాటలు కోలీవుడ్‌లో వైరల్ అయ్యాయి. కానీ విడాకులు తీసుకున్న కూడా భార్యభర్తలుగా వేరుగా ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులుగా మాత్రం ఎప్పుడు కలిసే కనిపించారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు.

Also Read : Kangana Ranaut : వయస్సు గురించి నాకు పట్టింపు లేదు..

వారి పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో వీరిద్దరు కలుస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ఇక తాజాగా కొడుకు యాత్ర డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్లు ధనుష్ పేర్కొన్నాడు. తమ కొడుకు సాధించిన ఈ విజయాన్ని చూసి తల్లిదండ్రులుగా తమ మనసు ఉప్పొంగిపోతుందని పేర్కొన్నాడు. ఈ మేరకు యాత్ర గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్‌లో ధనుష్‌తో పాటు ఐశ్వర్య కూడా పాల్గొన్నారు. కాగా ధనుష్ ఇంకా ఐశ్వర్య కలిసి తన కొడుకుని కౌగిలించుకున్న ఫోటో వైరల్ అవుతుంది. దీంతో ధనుష్ ఇంకా ఐశ్వర్య కలిసి పోతే బాగుండు అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Exit mobile version