లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘దండోరా’ మూవీ సక్సెస్ మీట్‌లో శివాజీ మాట్లాడుతూ ‘‘హనుమాన్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి ప్రొడ్యూస్ చేయటానికి వచ్చారు. నీలకంఠగారైతే తరాలకొకసారే ఇలాంటి సినిమా వస్తుందని అన్నారు. ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు. నార్త్ అమెరికాలో షోలు బాగా పెరిగాయి. ఒక షో పెట్టినవాళ్లు.. మూడు షోస్‌కు పెంచారు.
Also Read: Shivaji: పాపం శివాజీ.. చివరికి వాళ్ళిద్దరూ ఒక్కటే!
మలయాళ సినిమా డైరెక్టర్స్, మారి సెల్వరాజ్ వంటి డైరెక్టర్‌తో పోల్చి మురళీకాంత్ గురించి మాట్లాడుతున్నారంటే.. మాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ క్యారెక్టర్ చూస్తే అద్భుతమైన నటులు వస్తున్నారని తెలుస్తుంది. ప్రతి పాత్ర బాగా కుదిరింది. ఈ సినిమా షూటింగ్ చేస్తునన్ని రోజులు నేను రోజుకి 2 గంటలే పడుకునేవాడిని. ఇందులో నాకు కొడుకు, కూతురు.. పాత్రలుంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయాలంటే పాత్రలో ఆ లుక్ కనిపించాలి. డైరెక్టర్ అడగకపోయినా నేను కష్టపడ్డాను. అందరూ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. అందరూ ఈ సినిమాను భుజాలకెత్తుకున్నారు. సినిమా లాంగ్ రన్‌తో అందరూ మాట్లాడుకునేలా ఉంది. థియేటర్స్‌కు వచ్చి ఆడియెన్స్‌తో నేరుగా మాట్లాడుతాను. నిర్మాతకు ప్రేక్షకుల సపోర్ట్ ఉండాలి’’ అన్నారు.
Also Read: Dhurandhar Collections: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు.. ‘జవాన్’ రికార్డు బద్దలు!
నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మాట్లాడుతూ ‘‘సినిమాకు ప్రేక్షకుల నుంచే కాదు..విమర్శకుల నుంచి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్‌కు వచ్చి దండోరా సినిమాను చూసి ఆదరించండి’’ అన్నారు. ఇక శివాజీ క్యారెక్టర్‌పై ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు.. అందరూ దండోరా గురించి మాట్లాడకుండా వేరే విషయాలు గురించి మాట్లాడుతున్నారు..కదా అని మీడియా ప్రశ్నించగా శివాజీ మాట్లాడుతూ ‘‘ఏమీ లేదు.. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది.. మనం ఏమీ మాట్లాడకూడదు’’ అన్నారు.
