NTV Telugu Site icon

NagaVamsi : రాసి పెట్టుకోండి..ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ దబిడి దిబిడే

Daakumaharaaj

Daakumaharaaj

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్నా ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : KA10 : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ టీజర్ రిలీజ్..హిట్ కళ కనిపిస్తోంది

కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నాగవంశీ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘ మీకు సమరసింహా రెడ్డి యాక్షన్ గుర్తుందా. అసలైన మాస్ సినిమా అంటే ఏమిటో నిర్వచించింది ఆ యాక్షన్ అని సమరసింహా రెడ్డి పవర్ఫుల్ యాక్షన్ సీన్ ఫోటోను జతచేస్తూ.. నా మాటలను గుర్తుపెట్టుకోండి. డాకు మహారాజ్ లో సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంది,  ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులను గుర్తుకురావడమే కాదు మీకు అదే ఊపునిస్తుంది. ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్’ అని పోస్ట్ చేసారు. తమన్ సంగీతం అందిస్తున్న డాకు మహారాజ్ ట్రైలర్ ఈ నెల 5న రిలీజ్ కానుంది.

Show comments