నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read : Bollywood : బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసా..?
కాగా నిన్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో జరగాల్సి ఉంది. అందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లను కూడా పూర్తి చేసారు మేకర్స్. కానీ బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్స్ జారీ చేసే సమయంలో క్యూలైన్స్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన కారణంగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. దీంతో నందమూరి అభిమానులు కాస్త డీలా పడ్డారు. ఇప్పడు వారి కోసం మేకర్స్ మరో ఈవెంట్ ప్లాన్ చేసారు. డాకు మహారాజ్ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లోని ITC కోహినూర్ హోటల్ లో నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణతో పాటు టోటల్ టీమ్ ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండంగా సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.