నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘దాదా’. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ సరికొత్త పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నారు.
అయితే గతనెలలో ఈసినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ పరిసరాల్లో జరుగుతున్నసమయంలో బాలకృష్ణ గాయపడడంతో మోకాలికి సర్జరీ నిర్వహించారు వైద్యులు. కొద్ది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుని కోలుకున్న నటసింహం తిరిగి షూట్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా మైసూర్ షెడ్యూల్ షూటింగ్ సెప్టెంబర్ 29 నుండి స్టార్ట్ చేసి ముందుగా ఇతర కీలక నటీనటులతో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఈరోజు నుంచి ఈ మైసూర్ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌లో బాలయ్యపై కొన్ని భారీ యాక్షన్ సీన్లు, డ్రామా సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నాడు. చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. నందమూరి తమన్ గా పేరు తెచ్చుకున్న తమన్ ఈ సినిమాను సంగీతం అందిస్తున్నారు.

