Site icon NTV Telugu

DaakuMaharaaj : డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణం ఇదే

Daaku Maharaaj

Daaku Maharaaj

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Also Read : DaakuMaharaaj : బాలయ్యలో నాకు అది కనిపించలేదు : శ్రద్ధా శ్రీనాథ్

కాగా నేడు ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసారు మేకర్స్. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసారు మేకర్స్. బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్స్ జారీ చేసే సమయంలో క్యూలైన్స్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆ కారణంగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేశారు . ఈ విషయాన్ని అధికారకాంగప్రకటించారు నిర్మాత నాగవంశీ. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ లో మరో ఈవెంట్ ను ప్లాన్ చేస్తారెమో చూడాలి.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండంగా సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

 

Exit mobile version