సీనియర్ హీరోలలో సూపర్ హిట్స్ తో టాప్ లో దూసుకెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది ఈ సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదంపై CP సుధీర్ బాబు రియాక్షన్
కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ అందించారు నిర్మాతలు. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 14న అనగా రాబోయే శనివారం రోజున విడుదల చేస్తామని పోస్టర్ రిలీజ్ చేసారు. సినిమాలో బాలయ్య క్యారక్టర్ యొక్క పాత్రని వివరిస్తూ ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. అయితే సహజంగానే బాలయ్య సినిమా అంటేనే మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసే థమన్ డాకు మహారాజ్ ఫస్ట్ సాంగ్ కు తమన్ దుమ్ములేచే మ్యూజిక్ ఇస్తాడని బాలయ్యఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రేపు ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేయనున్నారు.