నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డాకు మహారాజ్. సాయి సౌజన్య నాగ వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే రిలీజ్ తర్వాత మంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదటి రోజు ఈ స్థాయిలో వసూలు రాబట్టినట్లు వెల్లడించారు. ఇక ఇప్పటివరకు ఇది నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చెప్పొచ్చు.
Daaku Maharaaj: ఆన్ స్క్రీన్ లో అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా ఊర్వశితో బాలయ్య దబిడి దిబిడే!
ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల 56 లక్షలు ఈ సినిమాకి షేర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. మొదటిరోజు ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా పండుగ సందర్భంగా ఇంకా ముందు ముందుకు దూసుకుపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ ప్రధానమైన అసెట్ గా నిలిచింది. తమన్ సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాకి పోటీగా ఇప్పటికే గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. రేపు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతోంది. అయినా ఈ సినిమాకి మాస్ అపీల్ ఉండడంతో పండుగ కలెక్షన్స్ గట్టిగానే వర్కౌట్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి.