నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్యానల్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద నాగ వంశీ సాయి, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి మరో టాక్ వినిపిస్తోంది. అదేంటంటే ఇప్పటివరకు బాలకృష్ణ కేవలం తెలుగు హీరోగా మాత్రమే అందరికీ పరిచయం కానీ ఈ సినిమాలో ఉన్న ఎపిసోడ్స్ ప్రకారం సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయొచ్చని అలా చేస్తే బాలకృష్ణకు ఇది ఫస్ట్ నార్త్ డెబ్యూ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగానే నార్త్ ప్రేక్షకులకు రక్తపాతంతో పాటు అద్భుతమైన ఫైట్లు ఉంటే సినిమాలు బీభత్సంగా ఎక్కేస్తాయి.
Game Changer: నానా హైరానా కూడా వచ్చేసింది!
అందుకే ఆర్ఆర్ఆర్, దేవర,పుష్ప, పుష్ప 2, కేజిఎఫ్ లాంటి సినిమాలను నెత్తిన పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నందమూరి బాలకృష్ణకు అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ పడ్డాయి కాబట్టి ఈ సినిమాని హిందీలో డబ్బింగ్ చేయించి ధియేటర్లలో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బాలకృష్ణకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాని డబ్బింగ్ చేసి ఓటిటిలో హిందీలో రిలీజ్ చేసే ఆలోచన ఉందని ఇప్పటికే నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. సినిమా రిలీజ్ అయిన ఇక్కడి రెస్పాన్స్ చూసి తర్వాత మరి హిందీ థియేటర్లలో కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి.