NTV Telugu Site icon

Daaku Maharaaj : డాకు నిలువు దోపిడీ.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు అంటే?

Daakumaharaaj (3)

Daakumaharaaj (3)

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యతో కలిసి నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నందమూరి బాలకృష్ణని ఇప్పటివరకు చూపించని విధంగా బాబీ చూపించాడు అంటూ బాబీ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నందమూరి అభిమానులు. ఏకంగా కొంతమంది అయితే నాగవంశీకి గుడి కడతామని కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు రోజుల వసూళ్లు గట్టిగా రాగా మొత్తం మూడు రోజులకు గాను ఏకంగా 92 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

Sankranthiki Vasthunam: వెంకీ మామ క్రేజ్..టికెట్లు లేవ్.. థియేటర్లలోకి ఎక్స్ట్రా కుర్చీలు

కింగ్ ఆఫ్ సంక్రాంతి గా సినిమా టీం ప్రచారం చేసుకుంటున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులలో 92 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా శ్రద్ధ శ్రీనాథ్ తో పాటు ఊర్వశీ రవితేజ కీలక పాత్రలలో నటించారు బాలీవుడ్ హీరో బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ సినిమాలో అనేకమంది టాలెంటెడ్ నటీనటులు నటించారు. ఇక సినిమాలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్స్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.. బాలకృష్ణ సినిమాని ఇంత అందంగా తీర్చి దిద్దడంతో దర్శకుడు బాబీతో పాటు నాగవంశీ మీద కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. మొత్తం మీద మూడు రోజుల్లోనే 92 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం అనేది బాలకృష్ణ కెరియర్ లో ఒక అరుదైన ఫీట్ అని చెప్పాలి.

Show comments