Site icon NTV Telugu

Cyclone Montha : మాస్ జాతర’కి తుఫాన్ టెన్షన్

Mass Jathara

Mass Jathara

ఈ వారం సినీ ప్రేక్షకులకు భారీ వినోదం అందించడానికి సిద్ధమవుతున్న సమయంలో, ‘మొంథా’ తుఫాన్ ప్రభావం పెను శాపంగా మారింది. మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా ‘మాస్ జాతర’ ఈ వారం విడుదల కానుంది. అదే సమయంలో, ‘బాహుబలి’ సినిమాను కూడా రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రేక్షకులు థియేటర్ల వరకు రాలేక, సినిమా బుకింగ్స్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Also Read:Nithin: ఎల్లమ్మ వద్దనుకుని అలాంటి సినిమా ఫైనల్ చేసిన నితిన్

తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణలో కూడా ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.

Also Read:Horror: యువకుడిని కారు టాప్ పై ఉంచి.. 8 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్..

‘మాస్ జాతర’ సినిమా రవితేజకు, దర్శకుడు భాను, నిర్మాత నాగవంశీలకు హిట్ అనివార్యం. ఈ సినిమాపై వారు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, వర్షం ఇలాగే కొనసాగుతూ ఉంటే, తొలి మూడు రోజుల కలెక్షన్లు, భారీగా అవుతాయనుకున్న బుకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తుఫాన్ పరిస్థితులు త్వరగా మెరుగుపడి, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి, తమ మాస్ జాతరను ఆస్వాదిస్తారని సినిమా యూనిట్ ఆశిస్తోంది. ఇక అక్టోబర్ 31వ తేదీ బాహుబలి రీ రిలీజ్ అవుతుండగా అదే రోజు సాయంత్రం నుంచి మాస్ జాతర ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.

Exit mobile version