NTV Telugu Site icon

Jani Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్.. తీర్పు రేపటికి వాయిదా

Jani Master Bail

Jani Master Bail

Police Petition Seeking Custody of Jani Master : జానీ మాస్టర్‌ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌ వేశారన్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ నార్సింగి పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిఉందన్న పోలీసులు కోర్టుకు తెలిపుతూ జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో తీర్పు రేపటికి వాయిదా వేసింది రంగారెడ్డి కోర్టు. సహాయ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులు జానీ మాస్టర్ ను ఈనెల 19న అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ ముందు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

Siddique: రేప్ కేసులో స్టార్ యాక్టర్ పరారీ.. లుక్ అవుట్ నోటీసులు జారీ

గోవాలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గోవాలోని ఓ హోటల్ లో మాస్టర్‌ను అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్‌ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉండగా ఆయన్ను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జానీపై పోక్సో కేసు(POCSO case) నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు ఈ పిటిషన్‌ను బదిలీ చేశారు. ఇదిలా ఉండగా బెయిల్ కోసం జానీ మాస్టర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బెయిల్ పిటిషన్ పై కూడా రేపు వాదనలు జరగనున్నాయి.