ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక . ఇటీవల ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అందుకున్న రష్మిక బాషతోసంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అలా బాలీవుడ్ లో ‘యానిమల్’ సినిమాతో సత్తా చాటిన ఈ చిన్నది ప్రజంట్ ‘చావా’ వంటి హిస్టారికల్ మూవీతో రాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ‘పుష్ప’ మూవీ థాంక్స్ మీట్ నిర్వాహించిన విషయం తెలిసిందే. ఈ మీట్ కి రష్మిక అటెండ్ అవ్వలేదు.. అందుకే మూవీ టీం కు థాంక్స్ చెబుతూ ఇన్ స్టాలో స్టోరి పెట్టింది రష్మిక.
Also Read:Thala: ‘తల’ మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
అయితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా సక్సెస్ పార్టీ చేసుకుంటున్నాయి. అలాంటిది ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించిన ‘పుష్ప 2’ మూవీ మాత్రం ఎలాంటి గ్రాండ్ ఈవెంట్ జరుపుకోలేదు. దీంతో అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉండిపోయారు. దీనికి కారణం సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన. దీని వల్ల పబ్లిక్ గా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో రీసెంట్ గా చిన్న థాంక్స్ మీట్‌ని ఏర్పాటు చేశారు మూవీ టీం. ఇందులో భాగంగా అల్లు అర్జున్, సునీల్, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ మూవీతో వారికున్న అనుబంధం గురించి పంచుకున్నారు. ఇక ఈవెంట్ కి అటెండ్ అవ్వని రష్మిక ..
‘ఈ సినిమా చేయడానికి మీరు పడిన కష్టం నాకు తెలుసు. శ్రీవల్లి పాత్రలో ప్రేక్షకులలో నను భాగంగా చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుకు గారు నా హృదయంలో మీకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే అప్-డైరెక్షన్ టీమ్, ప్రొడక్షన్ టీమ్, కెమెరా డిపార్ట్‌మెంట్, లైట్ డిపార్ట్‌మెంట్, మేకప్ -హెయిర్-కాస్ట్యూమ్-సెట్ – బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులు, డాన్సర్‌లు ప్రతి ఒక్కరి నా ధన్యవాదాలు.మీ కష్టానికి మంచి ఫలితం లభించింది. ఈ అద్భుతమైన ప్రయాణంలో నేను ఒక భాగం కావడం నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.