NTV Telugu Site icon

COOLI : వైజాగ్ షెడ్యూల్ ‘ కూలీ’ షూటింగ్ లో రజనీకాంత్ కు ఏమైంది..?

Rajanikanth

Rajanikanth

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో లో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా ‘కూలీ’ షూటింగ్ కారణంగా రజనీకి ఆరోగ్యసమస్యలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై కూలి చిత్ర దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ వివరణ ఇచ్చారు.

Also Read : Tollywood : రాజేంద్రప్రసాద్ కు Jr .NTR, పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి

లోకేష్ మాట్లాడుతూ ” ఆ వార్తల్లో నిజం లేదు, అసలు ఇలాంటివి ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు. ఇటువంటి ఫేక్ న్యూస్ విన్నపుడు ఎంతో బాధగా ఉంటుంది. గత నెల రజనీకాంత్‌ వైజాగ్‌ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందని చెప్పారు. అందుకు అనుగుణంగా సెప్టెంబర్‌ 28 లోగా రజనీ సీన్స్ షూటింగ్‌ పూర్తి చేశాం. 30వ తేదీన ఆయన ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్‌ మాకు ముఖ్యం కాదు. ఇంకోసారి ఇటువంటి వార్తలు రాసే తప్పుడు పూర్తిగా తెలుసుకుని అవగాహన వచ్చిన తర్వాతే రాయండి అని కోరుతున్న. కూలి సెకండ్ షెడ్యూల్ ఈ అక్టోబర్‌ 15న చెన్నైలో స్టార్ట్ కానుంది. ఆ షెడ్యూల్ లో రజనీకాంత్‌ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారు” అని లోకేశ్‌ తెలిపారు. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show comments