Site icon NTV Telugu

నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ

Complaint against Konidela Niharika Husband Chaitanya

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడని వారు నివాసముంటున్న అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నిహారిక భర్త సైతం అపార్ట్ మెంట్ వాసులపై ఫిర్యాదు చేసాడట. పరస్పర ఫిర్యాదుల అనంతరం పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. అయితే గొడవకు గల కారణాలు, వివరాలు ఇంకా తెలియరాలేదు.

Read Also : మెగా అప్డేట్… “ఆచార్య” రిలీజ్ కూడా అప్పుడే…!

చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9 న ఉదై విలాస్ ప్యాలెస్‌లో వివాహం జరిగింది. పెళ్ళితోపాటు ఆ తరువాత జరిగిన రిసెప్షన్ కూడా ఘనంగా జరిగింది. ఇక నిహారిక యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు అనుకున్నంత క్రేజ్ లభించలేదు. తెలుగు, తమిళ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది నిహారిక.

Exit mobile version