Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్‌ రేట్లపై ఫైర్‌ అవుతున్న కామన్‌ ఆడియన్‌

Ticket Rates Hikes

Ticket Rates Hikes

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్‌ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే రెండు తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా టిక్కెట్ ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కామన్ ఆడియన్స్ కు ఈ రేట్ల పెంపుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 23 న ప్రత్యేక ప్రీమియర్‌ షో మల్టీప్లెక్స్ లలో 400 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 300.. రెగ్యులర్ షోస్ కు 10 రోజుల పాటు మల్టీప్లెక్స్ లలో టికెట్ కు 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునెలా అనుమతులు ఇచ్చింది. ఇక తెలంగాణలోని థియేటర్లలో పెంచిన టిక్కెట్ రేట్లు మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ ధరను రూ. 390 సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ ధర రూ. 225, స్పెషల్ షోల కోసం ఒక్కో టిక్కెట్ ధరను ఏకంగా రూ. 500గా ధరలు పెంచారు.

ఇటీవలి కాలంలో సినిమాల నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో, రికవరీ కోసం నిర్మాతలు విడుదల సమయంలో టిక్కెట్ ధరల పెంపుపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. సినిమా బడ్జెట్ భారాన్ని తగ్గించుకోవడానికి నిర్మాతలు వేస్తున్న ఈ వ్యూహం, అంతిమంగా సామాన్య ప్రేక్షకుడి జేబుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కుటుంబ సమేతంగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకునే సామాన్య ప్రేక్షకులకు ఈ టిక్కెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం టిక్కెట్ ధరలే కాకుండా స్నాక్స్, పార్కింగ్ ఖర్చులతో కలిపి ఒక కుటుంబం సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో, ఇలాంటి భారీ రేట్లు సామాన్యులను థియేటర్లకు దూరం చేసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.