తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి, హీరోగా కూడా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం పెళ్లికాని ప్రసాద్ మార్చి 21, 2025న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన సప్తగిరి, తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. ” ఈ సినిమాలో నా పక్కన హీరోయిన్‌గా నటించడానికి చాలామంది రిజెక్ట్ చేశారు” అని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సప్తగిరి కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో తనదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ వంటి సినిమాలతో హీరోగా కూడా ప్రయత్నించారు. అయితే, ఆ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు.
Bandla Ganesh : బండ్ల గణేశ్ సంచలన పోస్టు.. అతడిని ఉద్దేశించేనా..?
ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ తో మరోసారి హీరోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని చూస్తున్నారు. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కేవై బాబు నిర్మించగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ బ్యానర్‌పై దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సప్తగిరి మాట్లాడుతూ, తాను కమెడియన్ అనే కారణంగా కొందరు హీరోయిన్లు తనతో జత కట్టడానికి సంకోచించినట్లు తెలిపారు. అయినప్పటికీ “నా సినిమాలు నవ్వులతో నిండి ఉంటాయి, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే చాలు” అని ఆయన అన్నారు. ఈ చిత్రంలో ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, మురళీధర్ గౌడ్, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పెళ్లికాని ప్రసాద్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా సప్తగిరి ఈ సినిమాతో హిట్ కొడతారా లేదా అనేది మార్చి 21న తేలనుంది.