NTV Telugu Site icon

Cinema News : సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో ట్రెండింగ్ ఉన్న స్టార్ హీరో..?

Untitled Design (56)

Untitled Design (56)

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం చాలా పెరిగింది. ఒక సినిమా బాగుందంటే ప్రతి ఒక్కరు ఆ సినిమాకు సెల్ఫ్ ప్రమోషన్స్ చేస్తుంటారు. అదే భారీ అంచనాల మధ్య విడుదలై కొంచం అటు ఇటు అయినా ఇతర హీరోల ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తారు. అందుకే ఈ మధ్య ఏదైనా సినిమా నుండి ఒక పోస్టర్ లేదా సాంగ్ లేదా గ్లిమ్స్ రిలీజ్ అవుతుందంటే మేకర్స్ చాలా జాగత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కొంచం తేడా కొట్టిందంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ పరిధులు దాటీ మరి ఉంటుంది.

Also Read: KGF : త్వరలోనే సెట్స్ పైకి KGF -3.. హీరో ఎవరంటే..?

తాజాగా దేవర చిత్రంలోని సెకండ్ సాంగ్ రిలీజ్ అంటూ ఓ పోస్టర్ వదిలింది నిర్మాణ సంస్థ. కానీ ఏమంత ఆకట్టుకోలేదు సరి కదా కొంత నెగిటివిటీ తెచ్చుకుంది. దీంతో చిన్నపాటి గ్లిమ్స్ ను వదిలి ఆ ట్రోల్స్ కు అడ్డుకట్ట వేసింది యూనిట్. ఇక కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మరోసారి ట్రోల్స్ గురయ్యాడు. తన లేటెస్ట్ సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా నుండి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేసింది యూనిట్. ఈ పాటలో విజయ్ లుక్స్, డాన్స్ మూమెంట్స్ దారుణంగా ట్రోల్స్ కి గురవుతున్నాయి.

Also Read: Filmfare Awards 2024: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 విజేతలు ఎవరంటే..?

విజయ్ డీ ఏజింగ్ లుక్ లో కనిపించే సీన్స్, విజయ్ డాన్స్ కనీసం ఫ్యాన్స్ కు కూడా మెప్పించలేకపోయాయి. విజయ్ ద్విపాత్రాభినయంలో రానున్నఈ చిత్రానికి విభిన్న కథాంశాల దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబరు 5న రానుంది.

Show comments