The Odyssey : ‘ది ఒడిస్సీ’కి ఎందుకంత భయపడుతున్నారు?

The Odessy

The Odessy

ఓ సినిమా పోస్ట్‌పోన్ అయితే అందులో ఆశ్చర్యమే లేదు, అదే ప్రీపోన్ అయితే ఏదో మతలబు ఉన్నట్లే! బాలీవుడ్ ఫిల్మ్స్ ‘ఆల్ఫా’, ‘ధమాల్ 4’ సడన్‌గా రిలీజ్ డేట్స్ చేంజ్ చేసుకున్నాయి. అనౌన్స్ చేసిన దానికి ఒక వారం ముందుగానే వచ్చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటి? అందరూ అనుకుంటున్నట్లుగా ఆ సినిమా బాలీవుడ్ ని అంతలా భయపెడుతుందా?

ఆలియా భట్ నటించిన ‘ఆల్ఫా’ మొన్నటి వరకు ఎప్పుడు వస్తుందో సరైన క్లారిటీ లేదు. గత ఏడాది క్రిస్మస్‌కి రావలసిన ఈ స్పై థ్రిల్లర్, ఈ ఏడాది ఏప్రిల్‌కు, ఆ తర్వాత జూలై 10కి వాయిదా పడింది. కానీ రీసెంట్‌గా టీజర్ వదిలి, జూలై 3న వస్తున్నట్లు ప్రకటించింది యష్ రాజ్ ఫిలిమ్స్. భారీ మల్టీస్టారర్ ఫిలిం ‘ధమాల్ 4’ కూడా పలుమార్లు వాయిదా పడి, చివరికి జూలై 17న డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ సడన్‌గా యూటర్న్ తీసుకుని జూలై 10నే వచ్చేస్తోంది.

×
×
Ad

‘ఆల్ఫా’, ‘ధమాల్ 4’ మూవీస్ వన్ వీక్ బిఫోర్ రావడానికి కారణమైంది ఓ భయం. అది సృష్టించింది ఓ హాలీవుడ్ డైరెక్టర్. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుంచి రాబోతున్న హై-యాక్షన్ ఫిలిం ‘ది ఒడిస్సీ’. ‘ఓపెన్‌హైమర్’ తర్వాత ఈ దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ మొదలయ్యాయి. జూలై 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ గ్రీక్ మైథలాజికల్ ఫిలిం. ఏడాది క్రితమే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి అంటే, ఈ సినిమాకు ఎంత హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఓవర్సీస్‌లోనే కాదు, ఇండియాలోనూ ఈ సినిమాకు విపరీతమైన బజ్ నడుస్తోంది. ఇప్పటికే ‘ది ఒడిస్సీ’ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ స్టార్ట్ కాగా, హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. మన సినిమాలకు 1000 రూపాయల టికెట్ ప్రైస్ నిర్ణయిస్తే గగ్గోలు పెట్టే ఆడియన్స్, ‘ది ఒడిస్సీ’ టికెట్స్ 3000 చెబుతున్నా కొనేస్తున్నారంటే, ఈ మూవీపై దర్శకుడి గత సినిమాలకు ఉన్న మాస్ క్రేజే రీజన్. ఇప్పటికే ఇండియాలో రికార్డు స్థాయిలో 1.5 లక్షలకు పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఈ క్రేజ్ చూసే బాలీవుడ్ ఫిలిమ్స్ మెల్లిగా దుకాణం సర్దేసుకుని ముందుకు వచ్చేసాయి.