Site icon NTV Telugu

Jani Master: పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి.. వీడియో రిలీజ్ చేసిన జానీ మాస్టర్

Jani Master

Jani Master

జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలిందని, తాజాగా ఆయన్ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించారని వార్తలు రాగా దానిపై జానీ మాస్టర్ స్పందించారు. నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుంచి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!

Manchu Manoj: మనోజ్ కోసం మోహన్ బాబు నివాసానికి ఆళ్లగడ్డ బ్యాచ్?

నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో #GameChanger నుండి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అంటూ ఆయన మూడు నిముషాల వీడియో ఒకటి రిలీజ్ చేశారు.

Exit mobile version