శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునయన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజ రాజ చోర
. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కొంతకాలంగా లేనే లేవు. కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా ఈ మూవీ గురించి ప్రచార ఆర్భాటాలకు పోని దర్శక నిర్మాతలు ఇప్పుడు నిదానంగా వాటిని షురూ చేశారు. ఈ సినిమా హీరోగా నటిస్తున్న శ్రీవిష్ణు, మూవీలో అతని దోస్తుగా నటించిన బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వతోనే ఆ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. రాజ రాజ చోర
మూవీ అప్ డేట్స్ ఏవీ? అని భాస్కర్ పాత్ర పోషించిన శ్రీవిష్ణు అడుగుతుంటే… నువ్వు లేకపోయినా వాటిని సిద్ధం చేశానంటూ ఇందులో అంజమ్మగా నటించిన గంగవ్వ సమాధానం ఇస్తుంది. కాస్త మంచివి చూసి వదులు అని భాస్కర్ రిక్వెస్ట్ చేయడం విశేషం. ఫైనల్ గా చెప్పొచ్చేదేమంటే… ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చోర గాథ పేరుతో ఈ నెల 11న జనం ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.
నిజానికి నెల రోజుల క్రితమే
రాజరాజ చోరమూవీ టీజర్ విడుదల కావాల్సి ఉంది. కానీ పేండమిక్ సిట్యుయేషన్ లో దానిని విడుదల చేయడం ఇష్టంలేక వాయిదా వేశారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటంతో మూవీ గురించిన అప్ డేట్స్ ను జనాలకు తెలియచేసే పనిని షురూ చేశారు. మరి శ్రీవిష్ణు మార్క్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంటున్న
రాజ రాజ చోర` థియేటర్లలో విడుదల అవుతుందా? ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? అనేది వేచి చూడాలి. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కీర్తి చౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం వివేక్ సాగర్ సమకూర్చారు.
‘రాజరాజ చోర’ అప్ డేట్స్ ఎప్పుడంటే!?
