Site icon NTV Telugu

Tamannaah : ప్రేమించే వ్యక్తిని జాగ్రత్తగా ఎంచుకోండి..

Untitled Design (96)

Untitled Design (96)

నార్త్‌కు చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు ఆడియన్స్‌కు ఎంతగానో దగ్గరైంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి కెరీర్‌ను బలంగా నిలబెట్టుకుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న, ఇప్పటికీ అదే స్టార్ డమ్ తో విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా తన కెరీర్‌ను ఎక్కడ కూడా డౌన్ కాకుండా ప్రతి ఒక పాత్ర చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక స్కిన్ షో, బోల్డ్ సీన్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా ఈ బ్యూటీ, మరింత పాపులారిటి దక్కించుకుంది. ఇక ఈ అమ్మడు కెరీర్ విషయం పక్కన పెడితే.. నటుడు విజయ్ వర్మ తో తమన్నా దాదాపు రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాము ప్రేమలో ఉన్నట్లు మీడియాకి ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

Also Read: Venkatesh: మరో స్టైలిష్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ మామ..?

కానీ ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరు విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. వర్మకు సంబంధించిన ఫోటోలు,వీడియోలను తమన్నా తన సోషల్ మీడియాలో డిలీట్ చేసింది.దీంతో ఈ వార్త మరింత పుంజుకుంది. ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి తమన్నా మాట్లాడిన పలు విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
‘ప్రేమ, రిలేషన్ షిప్ అంటే ఏమిటి? అనే విషయంలో మనమందరం అయోమయానికి గురవుతుంటాం. కానీ ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. దానికి ఎలాంటి షరతులు వర్తించవు. అలాగే ఒకరిపై ఒకరికి ఎలాంటి అంచనాలు లేకుండా ఉన్నప్పుడే అది రిలేషన్షిప్ అవుతుంది. ఒకవేళ అవతలి వ్యక్తి నుంచి మీరేమైనా కోరుకుంటున్నారు అంటే అది వ్యాపారం అవుతుంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, వారిని వాళ్లలా ఉండనీయాలి. ఇవ్వని ఆలోచించుకుని ప్రేమించే వ్యక్తిని ఎంచుకోవడంలో జగ్రత్తగా ఉండండి’ అంటూ తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Exit mobile version