Veera Dheera Sooran Teaser: ఆసక్తికరంగా చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ యాక్టర్, స్టార్ హీరో చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్ యు అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఆర్ఆర్ఆర్,విక్రమ్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి, ముబైకార్, థగ్స్, మురా వంటి చిత్రాలను హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద రియా శిబు నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన నిర్మాతగా ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. కిరాణా కొట్టులో హీరో ఉండటం.. సరుకుల కోసం మహిళ రావడం.. తన కూతురికి డిస్టర్బ్ అవుతుంది మెల్లిగా అడుగు అంటూ హీరో అనడం.. జాలీగా తన ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్న హీరో ఆ తరువాత వెంటనే గన్‌తో విధ్వంసం సృష్టించడం.. అలా విక్రమ్ పాత్రలోని రెండు కోణాల్ని టీజర్‌లో చూపించాడు. ఇక పోలీస్ ఆఫీసర్‌గా ఎస్ జే సూర్య ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతోన్నారు. ఈ టీజర్‌లో ఈ సినిమాలో విక్రమ్, ఎస్ జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్‌లు బాగా హైలెట్ అయ్యారు.
Manchu Manoj: పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్.. మళ్ళీ తండ్రిపై ఫిర్యాదు?
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఇప్పటికే ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. ఈ మూవీ నుంచి ఇది వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ యూట్యూబ్‌లో ఇప్పటికే 14 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో చియాన్ విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, ఆర్ఆర్ వర్క్ ఇలా అన్నీ కూడా అభిమానుల అంచనాలను మించిపోయాయి. ఇక ఇందులో చియాన్ విక్రమ్ డిఫరెంట్ లుక్స్, ఎస్ జే సూర్య పర్ఫామెన్స్, పాత్రలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కేలా ఉంది. ఈ టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, జి.కె.ప్రసన్న ఎడిటింగ్, సి.ఎస్.బాలచందర్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!