కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నెక్ట్స్ రజనీకాంత్ సాంగ్ టైటిల్‌తో వస్తున్నాడు. ఎక్స్‌పరిమెంట్స్, మేకోవర్స్ సినిమాలు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌కు సెట్ కావట్లేదు. ప్రయోగాలు నేమ్ తెస్తున్నాయి కానీ కాసులు కురిపించడం లేదు. దీంతో రూట్ మార్చి వీర ధీర శూరన్ అంటూ నార్మల్ యాక్షన్ థ్రిల్లర్‌తో వచ్చి ఓకే అనిపించుకున్నాడు. కానీ ఇది విక్రమ్ స్థాయి హిట్ కాదు కానీ డీసెంట్ వసూళ్లు తెచ్చిపెట్టింది. దాంతో ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు అతడి ఫ్యాన్స్. అదీ చియాన్ 63తో తీర్చేయాలనుకుంటున్నాడు విక్రమ్.
పవర్ పుల్ టైటిల్‌తో వస్తున్నాడు చియాన్. కూలీలోని రజనీకాంత్ ‘పవర్ హౌస్’ సాంగ్ పేరును చియాన్ 63కి ఫిక్స్ చేశారు. ఇరుమగన్ దర్శకుడు ఆనంద్ శంకర్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు విక్రమ్. పదేళ్ల తర్వాత ఈ కాంబో సెట్టయ్యింది. ఇందులో క్లాస్ విక్రమ్‌ను చూపిస్తూనే.. డార్క్ షేడ్ చూపించాడు దర్శకుడు. టీజర్ ఇంప్రెసివ్ క్రియేట్ చేస్తోంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న పవర్ హౌస్ హై ఓల్డేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకక్కబోతుంది. గత ఏడాది వీర ధీర శూరన్‌తో తన కెరీర్ మళ్లీ పుంజుకోవడానికి కారణమైన నిర్మాత రియా షిబు ఇందులో చియాన్ సిస్టర్ గా కనిపించబోతుంది. నిర్మాత నుండి యాక్టర్‌గా టర్న్ తీసుకున్న రియా.. సర్వం మాయ, అతిరధి చిత్రాలతో రీసెంట్లీ మాలీవుడ్ లో భారీ హిట్స్ అందుకుంది. సర్వం మాయతో నివిన్ పౌలికి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో ఆచితూచి సినిమాలు చేస్తోన్న చియాన్.. పవర్ హౌస్‌తో కోలీవుడ్‌కు పవర్ హౌస్ అవుతాడా..?

