మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్‌లో ఇది 157వ సినిమా కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజా అప్‌డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్టు సమాచారం. మెగా అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా దీన్ని సిద్ధం చేశారు మేకర్స్. ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
Also Read : Salman khan : సెట్‌లో నటిని బెదిరించిన సల్మాన్.. ఇంతలోనే ఎంటరైన మీడియా !
ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో పనిచేస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనౌన్స్ చేసినప్పటి నుండి కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అనీల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు చిరంజీవి ఎనర్జీ మిక్స్ కావడంతో ఇది మాస్ ప్రేక్షకులకు పెద్ద ట్రీట్ అవుతుందని భావిస్తున్నారు. మరి టైటిల్ ఏంటి? గ్లింప్స్ ఎలా ఉంటాయి? అన్నది తెలుసుకోవాలంటే ఆగస్టు 22 వరకు వేచి చూడాల్సిందే.
