మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం మెగాభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం జోరందుకుంటోంది. వాయిదాలు, వెయిటింగ్‌లతో విసిగిపోయిన ఫ్యాన్స్‌కి ఇది నిజంగా మంచి వార్త. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
Also Read : Ranveer Singh : భర్తకు లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన దీపిక.. ఎన్ని కోట్లంటే..?
తాజాగా పూర్తి చేసిన 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్‌ను చిరంజీవి స్వయంగా వీక్షించగా, ఆయన ఈ అవుట్‌పుట్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ ఫుటేజ్ చూసిన తర్వాత చిరు, మిగిలిన ఐటెం సాంగ్, ప్యాచ్ వర్క్ కోసం త్వరలోనే డేట్లు ఇస్తానని చెప్పడంతో దర్శకుడు వశిష్ట ఇప్పటికే ఏర్పాట్లలో పడ్డారు తెలుస్తోంది. ఇక యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 18 నే సినిమా విడుదల తేదీగా లాక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌లో మార్పు ఉండదని యూనిట్ ఖచ్చితంగా చెబుతోందట. త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ ఎంటర్టైనర్‌కు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, యువి క్రియేషన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు రిలీజ్ డేట్ లాక్ అయితే, మళ్లీ ప్రమోషన్ గేర్ మార్చే అవకాశాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి.
