మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం మొదలవుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ వేరే స్థాయిలో ఉంటుంది. అందుకే చిరు సినిమా అంటే సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఇక ప్రజంట్ ఆయన నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్ డేట్ కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం మొదట 2024 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
Also Read : Kantara Chapter 1 :‘కాంతార’ నుంచి విలన్ ‘కులశేఖర’ పోస్టర్ రిలీజ్..
ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్లో ఉండటంతో, ఇందులో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తే క్వాలిటీ తగ్గుతుందని, అందుకే దర్శకుడు వశిష్ట మల్లిడి స్లోగా కానీ పర్ఫెక్ట్‌గా పనులు పూర్తి చేస్తున్నారని సమాచారం. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్స్ వచ్చాయి. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సీరియస్‌గా ఆలోచిస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పండుగ సీజన్‌లో సినిమా విడుదలైతే, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్ కూడా థియేటర్లకు భారీగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. మరి ఈసారైనా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తారా లేదా అన్నది చూడాలి.
