Site icon NTV Telugu

Kodamasimham : చిరంజీవి “కొదమసింహం” రీ రిలీజ్.. ఎప్పుడంటే?

Kodama Simham

Kodama Simham

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా “కొదమసింహం” సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన “కొదమసింహం” సినిమాను రీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. నవంబర్ 21వ తేదీన ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రీ రిలీజ్ చేయబోతున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు ఈ ప్రకటన చేశారు.

Also Read:Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ అంటున్న శ్రీ విష్ణు

మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్ గా నటించి ప్రేక్షకుల్ని అలరించిన “కొదమసింహం” సినిమాలో రాజ్ కోటి మ్యూజిక్, మోహన్ బాబు కామెడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కె. మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్స్ గా నటించారు. “కొదమసింహం” ప్రేక్షకుల్ని మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతోంది.

Exit mobile version